తొలికాత విద్యార్థులకే..
● పాఠశాలలో ఏటా పుచ్చకాయలు అందజేస్తున్న రైతు ఆనంద్
ఆ రైతుకు పిల్లలంటే ఎనలేని ప్రేమ. వారిని దైవంగా భావిస్తాడు. ఏటా తన చేనులో సాగైన పుచ్చకాయల తొలికాతను వారికే అందజేస్తాడు. ఐదేళ్లుగా ఇదే ఆనవాయితీ కొనసాగిస్తున్నాడు. అతడే తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన రైతు అండె ఆనంద్. తనకున్న రెండెకరాల్లో ఏటా పుచ్చ సాగు చేస్తున్నాడు. దిగుబడి షురూ అయ్యే క్రమంలో తొలికాతను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఐదేళ్లుగా అందజేస్తున్నాడు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక ప్రాథమిక, జెడ్పీ పాఠశాలలోని 200 మంది విద్యార్థులకు అందజేశాడు. ఇందులో మాజీ సర్పంచ్ అశోక్, మాజీ ఎంపీటీసీ రఘు, ఉపాధ్యాయులు సరిత,శిల్ప సిబ్బంది ఉన్నారు. – తాంసి
Comments
Please login to add a commentAdd a comment