హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగానికి ఎంపిక
బోథ్: మండలంలోని ధన్నూర్(బి) గ్రామానికి చెందిన మార రజినీకాంత్ రెడ్డి సోమవారం హాస్టల్ వెల్ఫేర్ అధికారి ఉద్యోగానికి ఎంపికయ్యారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో సిటీ బస్‌కండక్టర్ ఉద్యోగానికి ఆయన రాజీనామా చేశారు. కాగా హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సత్తా చాటిన సిరాజ్‌ఖాన్
బజార్‌హత్నూర్: టీజీపీఎస్‌సీ సోమవారం విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో మండలంలోని కొలారి గ్రామానికి చెందిన పటాన్ సిరాజ్‌ఖాన్ సత్తా చాటాడు. రైతు పటాన్ అంజత్‌ఖాన్, షకీలాబేగంల కుమారుడు సిరాజ్‌ఖాన్ రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించాడు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
నెన్నెల: ఆదిల్‌పేట కాలువ నుంచి మందమర్రి మండలం మామిడిగట్టుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. డ్రైవర్ మోహన్‌ను అదుపులోకి తీసుకొని ట్రాక్టర్‌ను నెన్నెల పో లీస్‌స్టేషన్‌కు తరలించి తహసీల్దార్‌కు అప్పగించామని పేర్కొన్నారు. డ్రైవర్‌తోపాటు ట్రాక్టర్ యజమాని మోర్లె మల్లేష్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండలంలోని వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే ఊరుకునేది లేదని
హెచ్చరించారు.
హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగానికి ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment