లోఓల్టేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు
భీమారం: వేసవి కాలంలో విద్యుత్ సరఫరాలో లో ఓల్టేజీ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని విద్యుత్ శాఖ ఎస్‌ఈ గంగాధర్ తెలిపారు. భీమారంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో రూ.కోటితో ఏర్పాటు చేసిన 8ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సబ్‌స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. వేసవి ఎండల కారణంగా విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని సబ్‌స్టేషన్లలో పలు పరికరాల ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టణాలతోపాటు గ్రామాలకు కూడా నిరంత రం నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీఈ కై సర్, ఏడీఏ బాలకృష్ణ, ఏఈ శంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment