● జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి
మంచిర్యాలఅగ్రికల్చర్: సమాజంలో మహిళలు వారికి ఉన్న హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో బేటీ బచావో– బేటీ పడావో మహిళా సాధికారత కేంద్రం, జిల్లా మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి మెంటల్ హెల్త్ అండ్ లీగల్ రైట్స్ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ, లోకల్ కంప్లయింట్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు.