మంచిర్యాలఅర్బన్: నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక సంస్థ(ఐటీఐ)లను నవీకరించిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాలు(ఏటీసీ) సర్వం సిద్ధమవుతున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు అధునాతన, సాంకేతికతపై శిక్షణకు ఆయా కేంద్రాల్లో వచ్చే విద్యాసంవత్సరం(జూన్ 2025) నుంచి తరగతుల ప్రారంభానికి చర్యలు వేగవంతమయ్యాయి. డిమాండ్ ఉన్న కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం, శిక్షణ పూర్తయిన వారికి స్వయం ఉపాధి కల్పించేలా పని చేస్తాయి. గత ఏడాది రూ.4.76 కోట్లతో మంచిర్యాల ఐటీఐ కళాశాల ఆవరణలో నిర్మాణ పనులు చేపట్టగా పూర్తయ్యాయి. పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా టాటా టెక్నాలజీ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఆరు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఏడాది, రెండేళ్ల కోర్సులకు సంబంధించి 172సీట్లు భర్తీ చేస్తారు. ఇప్పటికే ఏటీసీలకు 70శాతం ప్రయోగ పరికరాలు(యంత్రాలు) చేరగా బిగించారు. కోర్సులకు సంబంధించి ఏటీసీ భవనంలో డెల్‌వర్క్ స్టేషన్, ఐవోటీ కిట్, సర్వర్ రాక్, త్రీడీ ప్రింటర్, కార్ లిఫ్ట్, సిల్, ఫెయింట్ బాత్, ఇండస్ట్రియల్ రోబోటెక్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్(సీఎన్‌సీ), వీఎంసీ, ప్లంబింగ్ పరికరాలు బిగించారు. టాటా టిగోర్, టాటా ఏసీ, ఈవీ కిట్, మహేంద్ర త్రీవీలర్ ఇంకా రావాల్సింది.
కోర్సులకు ఆదరణ
ఐటీఐ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐలో 432 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 100, ఫిట్టర్ 100, ట ర్నర్ 40, ఎలక్ట్రానిక్ మెకానిక్ 24, మెకానిక్ 24, వె ల్డర్ 40, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(కోపా) 24, సోలార్ టెక్నీషియన్ 40, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ కోర్సులో 40 సీట్లు ఉ న్నాయి. ఇందులో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫ్యాషన్ డిజైన్, టెక్నాలజీ, సోలార్ టెక్నీషియన్ కోర్సులకు డిమాండ్ ఉంది. ఆరు కోర్సులతోపాటు మూ డు నెలల షార్ట్‌టర్మ్ కో ర్సుల్లో శిక్షణ ఇస్తారు. టూవీలర్ మెకానిక్, పెయిటింగ్, డెంటింగ్, లేజర్ కటింగ్(నాన్‌మెటల్), మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వాటిల్లో తర్ఫీదు ఇస్తారు. శిక్షణ వల్ల ఉద్యోగం, స్వయం ఉపాధి పెరగనుంది.
అధునాతన, సాంకేతికతపై శిక్షణ
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు
ఆరు కోర్సుల్లో 172 సీట్లు
వచ్చే ఏడాది ప్రవేశాలకు అవకాశం
ఏటీసీల్లో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలు జరుగనున్నా యి. 70శాతం యంత్రాలు అమర్చాం. శిక్షణ పొందిన విద్యార్థులను కంపెనీలు ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటాయి. ఉద్యోగాలు, స్వయం ఉపాధికి ఏటీసీలు దోహదపడనున్నాయి. 8వ తరగతి పాస్, 10వ తరగతి ఫెయిలైన వారు షార్ట్‌టర్మ్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చు.
– రమేష్, ప్రిన్సిపాల్, ఐటీఐ, మంచిర్యాల
కొత్త కోర్సులు ఇవే
కోర్సులు సీట్లు కాలవ్యవధి
మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్
కంట్రోల్ అండ్ ఆటోమేషిన్ 40 ఏడాది
ఇండస్ట్రియల్ రోబోటెక్స్, డిజిట్ మ్యానుఫ్యాక్చరింగ్ 40 ఏడాది
ఆర్టీసియన్ యూజింగ్ అడ్వాన్స్‌డ్ టూల్ 20 ఏడాది
బేసిక్‌డిజైనర్, వర్చువల్ వెరిఫయిర్ 24 రెండేళ్లు
అడ్వాన్స్‌డ్ సీఎన్‌సీ మిషనింగ్ టెక్నీషియన్ 24 రెండేళ్లు
మెకానిక్ ఎలక్ట్రానిక్ వెహికల్ 24 రెండేళ్లు
ఉపాధి లక్ష్యంగా ఏటీసీ
ఉపాధి లక్ష్యంగా ఏటీసీ