మంచిర్యాలక్రైం: పోలీస్ శాఖలో ఇంతకాలం విధులు నిర్వర్తించి విరమణ పొందుతున్న పోలీస్ అధికారులు శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం రామగుండం కమిషనరేట్‌లో పదవీ విరమణ ఎస్సై సీహెచ్.చక్రపాణి, ఏఎస్సైలు రవీందర్‌రావు, జీ.రవీందర్‌కుమార్, ఏఆర్ ఎస్సైలు కే.రాజయ్య, అహ్మద్ అలీబేగ్, హెడ్ కానిస్టేబుల్ ఏ.రమేష్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రాజు, ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఓ శ్రీనివాస్, ఆర్‌ఐ దామోదర్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బొర్లకుంట పోచలింగం పాల్గొన్నారు.