ఇంటర్ ప్రవేశాలు పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించాలి. డిగ్రీ మాదిరిగా ప్రవేశాలు నిర్వహిస్తే విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కార్పోరేట్ కళాశాలలకు చెందిన పీఆర్‌ఓలు గ్రామాల్లోకి వచ్చి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థుల నుండి అధిక ఫీజులు అడ్మిషన్ల సమయంలో వసూలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఆన్‌లైన్‌లో ప్రవేశాలు జరిపితే విద్యార్థి మంచి కళాశాలలో చదివే అవకాశం ఉంటుంది.
– బోయిడి ఆకాష్, ఏబీవీపీ నాయకుడు