
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
● ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ● ఆదివాసీలతో ఆత్మీయ సమ్మేళనం
ఉట్నూర్‌రూరల్: ఆదివాసీ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం ఉట్నూర్ మండలంలోని కేబీ కాంప్లెక్స్ పీఎంఆర్సీ భవనంలో ఆదివాసీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆదివాసీలకు చెందిన తొమ్మిది తెగల నాయకులు, పెద్దలు, రాయిసెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గతంలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులందరూ ఆదిలాబాద్ జిల్లా ప్రాముఖ్యతను, విశిష్టతను తెలియచేశారన్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాయన్నారు. ఆదివాసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే నేరం కావడంతో లెసెన్స్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీని పలువురు నాయకులు శాలువాతో సత్కరించారు. అనంతరం ఆదివాసీ నాయకులతో కలిసి సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు గోడం నగేశ్, జిల్లా మేడి మెస్రం దుర్గు పటేల్, మెస్రం మనోహర్, కెస్లాపూర్ ఆలయ పీఠాదిపతి మెస్రం వెంకట్‌రావు, ఆదివాసీ సార్‌మేడీలు, పటేల్‌లు, 9 తెగల నాయకులు, పెద్దలు, ఉట్నూర్ సీఐ మొగిలి, జైనథ్ సీఐ సాయినాథ్, రూరల్ సీఐ ఫణిందర్, ఎస్సైలు మనోహర్, సునీల్, సిబ్బంది పాల్గొన్నారు.