
ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య
లక్సెట్టిపేట: ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని పాతకొమ్ముగూడెం గ్రామానికి చెందిన గడికొప్పుల రామయ్య (65)తో అదే గ్రామానికి చెందిన వరుసకు అల్లుడైన సత్తయ్య కొంతకాలంగా గొడవపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. గ్రామంలో కనిపించిన చోట బూతులు తిడుతూ వేధింపులకు గురిచేశాడు. దీంతో మనస్తాపానికి గురైన రామయ్య మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుమారుడు మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.