
అత్యవసర వైద్యులను నియమించాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య అధికారులు(క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్)లు లేక ప్రత్యేక నిపుణులు, అధ్యాపకులను డీఎంఈ ఆదేశాల మేరకు సాధారణ అత్యవసర వైద్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో అత్యవసర వైద్యాధికారులను నియమించాలని ఆసుపత్రి వైద్యులు డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులు, అధ్యాపకులుగా పనిచేస్తున్న వారు మంగళవారం ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు. అత్యవసర విభాగాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు, అధ్యాపకులపై పనిభారం తగ్గించేందుకు వారి నియామకం తక్షణమే చేపట్టాలన్నారు. వైద్య నిపుణులపై అత్యవసర వైద్య బాధ్యతలను పెంచడంతో వారి అసలు విభాగాల్లో సేవల నాణ్యత తగ్గిపోతుందని, దీని కారణంగానే ఫ్యాకల్టీ సభ్యుల్లో నిరసన పెరిగి, కొత్తగా వచ్చే వారు ఆసక్తి చూపించడం లేదన్నారు. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లుగా తమకు విధులు అప్పగించవద్దని కోరారు.