జన్నారం: అడవి పంది దాడిలో మండలంలోని పొనకల్ గ్రామానికి చెందిన రైతు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు చిరివేణి కిషన్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం పొనకల్ గ్రామ శివారులోని పంట పొలాలకు కిషన్ నీరు పెట్టేందుకు వెళ్లగా అడవిపంది ఒక్కసారిగా దాడి చేసింది.
భయంతో కిషన్ కేకలు వేయగా సమీపంలో ఉన్న మరో వ్యక్తి రావడంతో అడవి పంది పారిపోయింది. దాడిలో కిషన్ కుడి భుజం, కుడి కన్ను కింద గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు జన్నారం ఆసుపత్రిలో చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు.