
నాణ్యమైన వరిధాన్యం కొనుగోలు చేయాలి
లక్సెట్టిపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముంద స్తు ఏర్పాట్లు చేయాలని, నిబంధనల మేరకు నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. మంగళవారం లక్సెట్టిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లక్సెట్టిపేట, జన్నారం, దండేపల్లి, హాజీపూర్ మండలాల వ్యవసాయ, పౌరసరఫరాల, సహకార, రవాణా, మార్కెటింగ్, డీఆర్‌డీఏ, సెర్ప్, మెప్మా అధికారులతో కలిసి యాసంగి 2024–25 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని వేర్వేరుగా కొనుగోలు చేయాలని తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి ట్యాగింగ్ చేసిన రైస్‌మిల్లులకు తరలించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావు, డీఆర్‌డీవో కిషన్, పౌరసరఫరాల మేనేజర్ శ్రీకళ, లక్సెట్టిపేట తహసీల్దార్ దిలీప్‌కుమార్, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.