
టోకెన్ సమ్మె విజయవంతం చేయాలి
శ్రీరాంపూర్: దేశవ్యాప్తంగా కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై అన్ని కార్మిక సంఘాలు కలిసి ఈనెల 20న దేశవ్యాప్త టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ సీతారామయ్య పిలుపునిచ్చారు. గురువారం ఆయన ఆర్కే 7గనిపై గేట్ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె జరుగుతుందన్నారు. కార్మికవర్గం నడ్డివిరిచే కొత్త చట్టాల అమలును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఓపెన్‌కాస్ట్‌లలో బొగ్గు తీసే పనిని కాంట్రాక్టర్లకు ఇవ్వొద్దన్నారు. ఓసీపీల్లో ప్రైవేట్ వారికి ఇచ్చిన బొగ్గు తవ్వకాలను రద్దు చేయాలని పేర్కొన్నారు. తాడిచర్ల 2, భూపాలపల్లి, వెంకటాపూర్2 గనులను సింగరేణికి ఇవ్వాలన్నారు. యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, కిషన్ రావు, బు చ్చయ్య, రామచందర్, చంద్రశేఖర్, అఫ్రోజ్ ఖాన్, సారయ్య, శ్రీనివాస్, సురేశ్, రాజేందర్, రాజ్‌కుమార్, రవీందర్, లింగమూర్తి, సంతోష్ పాల్గొన్నారు.