● నెన్నెల రెవెన్యూ అధికారుల చిత్రాలు ● ఎమ్మెల్యే అనుచరుడి కోసం అధికారుల దాసోహం ● చిక్కులో పడ్డానని తెలిసి సెలవులో తహసీల్దారు | - | Sakshi
Sakshi News home page

● నెన్నెల రెవెన్యూ అధికారుల చిత్రాలు ● ఎమ్మెల్యే అనుచరుడి కోసం అధికారుల దాసోహం ● చిక్కులో పడ్డానని తెలిసి సెలవులో తహసీల్దారు

Published Sat, Apr 5 2025 1:51 AM | Last Updated on Sat, Apr 5 2025 1:51 AM

● నెన్నెల రెవెన్యూ అధికారుల చిత్రాలు ● ఎమ్మెల్యే అనుచరు

● నెన్నెల రెవెన్యూ అధికారుల చిత్రాలు ● ఎమ్మెల్యే అనుచరు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బతికి ఉండగానే చనిపోయినట్లుగా చిత్రీకరించి దొంగ పట్టా చేసి రెండెకరాలు కాజేసే ఉదంతమిది. ఎమ్మెల్యే అనుచరుడి కోసం రెవెన్యూ అధికారులు తప్పు చేసి చిక్కుల్లో పడ్డారు. నెన్నెల మండలంలో జరిగిన ఈ ఘటనను గత నెల రోజులుగా రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యే అనుచరులు బయటకు పొక్కకుండా తొక్కి పెడుతున్నారు.

రెవెన్యూ అధికారుల బరితెగింపు

మంచిర్యాలకు చెందిన కుందూరు అశోక్‌రెడ్డి కుటుంబానికి నెన్నెల మండలం చిన్నావెంకటాపూర్‌లో వారసత్వ భూములు ఉన్నాయి. వీటిలో 132సర్వేనంబరు నాలుగు ఎకరాలను గంగారానికి చెందిన చిర్రం రమేశ్‌కు 2020లో అమ్మాలని అనుకున్నారు. మొత్తం రూ.14.80లక్షలకు గాను రూ. 8.50లక్షలు ఇచ్చారు. మిగతా డబ్బులు ఇవ్వడంలో జాప్యంపై పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగా యి. చివరికి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తూ భూ అమ్మకం రద్దు చేసుకున్నారు. రెండేళ్ల క్రితమే ఇరుపక్షాలు స్థానిక సర్పంచ్‌లు, పెద్దల సమక్షంలో లిఖిత పూర్వకంగా అంగీకరించారు. ఇటీవల అశోక్‌రెడ్డి కోడలు శ్రావ్యరెడ్డి పేరుతో 132/2సర్వే నంబరులో ఉన్న రెండెకరాలు చిర్రం రమేశ్‌ పేరిట పట్టా కావడంతో ఆశ్చర్యపోయారు. గత నెల 13న తమ భూమి సర్వే కోసం ధరణిలో చూస్తే పట్టాదారు పేరు మారినట్లు వెలుగులోకి వచ్చింది. ఎలా జరిగిందని స్థానిక తహసీల్దారును అడిగితే తమ పరిధిలో జరగలేదని తెలిపారు. చివరకు సీసీఎల్‌ఏను సంప్రదిస్తే.. శ్రావ్యరెడ్డి చనిపోయిందని, ఆమె స్థానంలో వారసుడిగా చిర్రం రమేశ్‌ను పేర్కొంటూ నెన్నెల తహసీల్దార్‌ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌ చేశారని పేర్కొన్నారు. దీనిపై అశోక్‌రెడ్డి కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, బెల్లంపల్లి ఆర్డీవో హరిక్రిష్ణ గుర్తించి, తహసీల్దార్‌తో గత నెల 22న శ్రావ్యరెడ్డి పేరుతో భూమి కోనుగోలు చేసినట్లు కొత్తగా 132/3సర్వే నంబరుపై ఆ రెండెకరాలను తిరిగి పట్టా చేశారు. మొదట పట్టాదారుకు తెలియకుండానే రిజిస్ట్రేషన్‌ చేస్తూ అధికారులు ఇంత రిస్కు ఎందుకు చేశారనేది అంతుచిక్కని ప్రశ్న.

అంతా తెలిసి చర్యల్లేవు

శ్రావ్యరెడ్డి చనిపోయినట్లు సృష్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ అశోక్‌రెడ్డి గత కొద్దిరోజులుగా ఫిర్యాదు చేస్తున్నా చర్యలు కరువయ్యాయి. సీసీఎల్‌ఏ, కలెక్టరేట్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. చివరకు నెన్నెల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, చిర్రం రమేశ్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement