
‘వక్ఫ్ బిల్లు ఆమోదం దేశానికి గర్వకారణం’
చెన్నూర్: వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం దేశానికి గర్వకారణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. శుక్రవా రం వక్ఫ్ బిల్లు ఆమోదంపై స్థానిక బీజేపీ కా ర్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చి త్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వక్ఫ్ బిల్లు సవరణతో అన్ని మతాలతోపాటు ముస్లింలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు జాడి తిరుపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బత్తుల సమ్మయ్య, తుమ్మ శ్రీపాల్, కేవీఏం శ్రీనివాస్, మానికరావు శంకర్, దుర్గాప్రసాద్, వంశీగౌడ్, రాజన్న పాల్గొన్నారు.