
కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు మద్దతు
జైపూర్: మండలంలోని ఇందారం ఐకే ఓసీపీ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, కాంట్రాక్ట్ వర్కర్స్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర తిరుపతి, బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోజ్‌ఖాన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శుక్రవారం సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందారం ఓసీపీ గనిలో పనిభారం ఎక్కువని, వారాహ కంపెనీలో వాల్వో డ్రైవర్లకు కనీస వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు తప్పని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నారని, సమస్య పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటామని తెలిపారు. వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్‌కే బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్‌రావు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు రవీందర్, కార్యదర్శులు పాల్గొన్నారు.