
పేదలందరికీ సన్నబియ్యం
చెన్నూర్‌రూరల్: రాష్ట్రంలోని పేదలందరికీ స న్న బియ్యం అందించాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీకి శ్రీకా రం చుట్టిందని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. శనివారం మండలంలోని కిష్టంపేట గ్రామంలో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హా మీలను నెరవేరుస్తోందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ సన్న బి య్యం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్‌రావు, కాంగ్రెస్ నాయకులు హే మంత్‌రెడ్డి, గజ్జెల అంకాగౌడ్, ముత్యాల బాపాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారు ఇంట్లో ఎమ్మెల్యే,
కలెక్టర్ భోజనం
చెన్నూర్‌రూరల్: మండలంలోని కిష్టంపేట గ్రామంలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం సన్నబియ్యంతో భోజనం చేశారు. రేషన్‌దుకాణంలో బియ్యం పంపిణీ అనంతరం లబ్ధిదారుడు మేడ తిరుపతిరెడ్డి ఇంట్లో సన్న బియ్యంతో వండిన అన్నం తిన్నారు. తహసీల్దార్ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

పేదలందరికీ సన్నబియ్యం