
ఇంటికి వాపస్ ఎల్తన్నం
పదిహేనేళ్ల నుంచి భవన నిర్మాణ కార్మి కుడిగా పని చేస్తున్న. గిన్నేళ్ల సంది గిప్పుడున్నట్లు ఎన్నడు సూడ లే. ఇప్పుడు వారంల మూడు రోజులకు మించి పనులు దొర్కుతలేవ్. దినాం అడ్డమీదికి వచ్చి పని దొర్కుతదేమోనని గంటలకొద్ది చూసి ఇంటికి వాపస్ ఎల్తన్నం. గిట్ల చేయబట్టి పూట గడవడానికి మస్తు తక్లీబైతంది.
– కంబాల రాజేశం, తాపీ కార్మికుడు
బతుకుదెరువుకు గోసైతంది
రెక్కల కష్టం మీద బతికేటోళ్లం. దినాం పని దొరికితే సంతోష మే కానీ గిప్పుడు పనుల కోసం వెతుకుడైతంది. రోజు ఎవలు పిలుస్తరా అని ఎదురు చూసుడైతంది. నా లెక్కనే చాలామంది పని లేక బతుకు దెరువుకు గోస పడ్తండ్లు. కూరగాయలకు సుత పైసలుంటలేవ్. ఎట్ల బతుకుడో ఏమో సమజైతలేదు.
– కల్లూరి సురేష్, తాపీ కార్మికుడు
ఇళ్ల నిర్మాణాలు తగ్గినయ్
ఎక్కడైన ఎవరైన ఇళ్లు మొదలు పెడితే అనేకమందికి పనులు దొర్కుతయ్. గత రెండేళ్ల సంది నుంచి ఇళ్ల నిర్మాణాలు బాగా తగ్గుతున్నయ్. కొత్తగా ఇళ్లు కట్టేటోళ్లు ముందుకు వస్తలేరు. ఈసారైతే పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఒకలో ఇద్దరో ఇళ్లు కట్టడానికి ముందుకు వస్తండ్లు. గిట్ల భవన నిర్మాణ రంగం పడిపోయి కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైంది. సర్కారు కార్మికులను ఆదుకోవాలే.
– తాడిశెట్టి రామ్‌కుమార్,
తాపీ కార్మిక సంఘం అధ్యక్షుడు

ఇంటికి వాపస్ ఎల్తన్నం

ఇంటికి వాపస్ ఎల్తన్నం