
కాంగ్రెస్‌తోనే పల్లెల అభివృద్ధి
● బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్
భీమిని: కాంగ్రెస్‌తోనే పల్లెల అభివృద్ధి సాధ్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. కన్నెపల్లి, భీమిని మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన భూమిపూజ చేశారు. కన్నెపల్లి మండలంలోని చెర్లపల్లి పాఠశాలలో నిర్మించిన అదనపు గదిని ప్రారంభించారు. జన్కాపూర్‌లో ఆరోగ్య ఉప కేంద్రానికి, ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ గదికి శంకుస్థాపన చేశారు. టేకులపల్లి, మల్లీడి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు, నాయకన్‌పేట్ పరిధిలోని గొల్లగూడ గ్రామానికి బీటీ రోడ్డుకు భూమిపూజ చేశారు. భీమిని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్మించిన డాక్టర్స్, నర్సు క్వార్టర్లను ప్రారంభించారు. భీమిని, కన్నెపల్లి రైతువేదికల్లో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదా రులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, తహసీల్దార్లు బికార్ణదాస్, శ్రవణ్‌కుమార్, ఎంపీడీవో గంగమోహన్, పీఎచ్‌సీ వైద్యుడు అనిల్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు.
హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి: బెల్లంపల్లి కాంట్రాక్టర్ బస్తీలోని శ్రీ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేక పూజలు చేశారు. మనుమత్ మన్యు సూక్త సహిత రుద్రహోమంలో హన్మాన్ భక్తులతో కలిసి హోమం చేశారు. ఎమ్మెల్యేకు ఆలయ అర్చకుడు విజయ్‌శర్మ, హన్మాన్ భక్తులు సన్మానం చేశారు.