
యువతను ప్రోత్సహించేందుకు చెస్ పోటీలు
బాసర: గ్రామీణ యువత, విద్యార్థుల్లో చెస్ ఆటను ప్రోత్సహించేందుకు క్యాంపస్‌లో చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్ తెలిపారు. ఆదివారం ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో రెండు రోజుల చెస్ పోటీలను డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్‌తో జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ చెస్ నెట్‌వర్క్ సంస్థ, హైదరాబాద్‌లోని గ్యాప్‌స్కిల్స్ లెర్నింగ్ సొల్యూషన్స్ మద్దతుతో టోర్నమెంట్ నిర్వహిస్తోందన్నారు. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ నేటి విద్యార్థులు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వంటి వాటిని పక్కన పెట్టి చెస్ ఆడాలన్నారు. ఆటల వల్ల ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. చెస్ నెట్‌వర్క్ బృంద సభ్యులు సంజయ్ గజ్జల, అధ్యక్షుడు హరి, ప్రధాన కార్యదర్శి రాజన్న, కిరణ్, కార్యవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.