
బిలోలిలో కుస్తీ పోటీలు
లోకేశ్వరం: మండలంలోని బిలోలి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం కుస్తీ పోటీలు నిర్వహించారు. తానూర్, ముధోల్, లోకేశ్వరం మండలాలతో పాటు మహారాష్ట్రకు చెందిన మల్లయోధులు కుస్తీపోటీల్లో పాల్గొన్నారు. వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుస్తీ పోటీల్లో నాందేడ్ జిల్లా బోర్‌దండీ గ్రామానికి చెందిన సాయినాథ్ అనే మల్లయోధుడు ప్రథమ బహుమతి రూ.5001లు అందుకున్నాడు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లోకేశ్వరం ఏఎస్సై దిగంబర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. నాయకులు కాంతారావు, నర్సింగ్‌రావు, ప్రభాకర్‌రావు, సతీశ్‌రావు, రాజశేఖర్‌రావు, లింగారావు, సుకుమార్‌రావు, రవీందర్‌రావు, ముత్యం, నాగారావు, భూమరావు, శ్రీనివాస్‌రావు, రాజు, రాజన్న, ఈరన్న, మనోహర్‌రావులు ఉన్నారు.