
‘పంటలు బాగా పండాలి’
జన్నారం: భక్తిభావంతో మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలని, భగవంతుని అనుగ్రహంతో రాష్ట్రంలో, నియోజకవర్గంలో సమృద్ధిగా వ ర్షాలు పడి పంటలు బాగా పండాలని ఖానాపూ ర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో హనుమాన్ విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ రవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీఖాన్, సీనియర్ నాయకులు మచ్చ శంకరయ్య, గు ర్రం మోహన్‌రెడ్డి, సతీశ్‌కుమార్, శేషురావు, స్వామి, తదితరులు పాల్గోన్నారు.