ఎన్నికల నిబంధనలు తప్పనిసరి
కంకరతేలి.. గుంతలు పడి ఎర్రమట్టి తండా రోడ్డు కంకరతేలి, గుంతలు పడటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వివరాలు 9లో u
పాపన్నపేట(మెదక్): ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరించారు. గురు వారం సాయంత్రం పాపన్నపేట ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలోని రెండు గదులను పోలింగ్ బూత్‌లుగా ఎంపిక చేశామన్నారు. ఉద్యోగులు ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు జరుగుతున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. భౌతికశాస్త్రంపై విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. వారు ఇచ్చిన సమాధానాలు విని సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఎంసెట్, ఐఐటీ ఎంట్రెన్స్‌లో భౌతికశాస్త్రానికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పా రు. అలాగే ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ సతీష్, హెచ్ఎం మహేశ్వర్ ఉన్నారు.
మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు
మెదక్‌జోన్: ఎమెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చి నందున మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తక్షణమే అమలులోకి వస్తుందని, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్‌రాజ్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జిల్లాలోని ఆర్డీఓలు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment