ఆరు గ్యారంటీల పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

ఆరు గ్యారంటీల పేరుతో మోసం

Published Fri, Jan 31 2025 8:07 AM | Last Updated on Fri, Jan 31 2025 8:06 AM

ఆరు గ్యారంటీల పేరుతో మోసం

ఆరు గ్యారంటీల పేరుతో మోసం

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి

మెదక్‌ మున్సిపాలిటీ: ఆరు గ్యారంటీల పేరుతో బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని రాందాస్‌ చౌరాస్తాలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్‌ నాయకులు సా ధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను వంచనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇస్తామని నమ్మబలికి ఏడాది పాటు ఊరించి చివరికి ఉసూరుమనిపించారని అన్నారు. అలాగే వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టి రైతులను మళ్లీ అప్పుల పాలు చేశారన్నారు. ఎరువులు, విత్తనాల కోసం మళ్లీ క్యూలైన్లు, కరెంట్‌ కోతలు, బోనస్‌ పేరిట బోగస్‌ మాటలు.. 420 రోజుల్లో ఎదురైన చేదు అనుభవాలన్నారు. ఇప్పటికే 410 మందికి పైగా రైతుల బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని రాందాస్‌ చౌరాస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులల్పించారు. ప్రభుత్వ వైఫల్యాలపై వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మెదక్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బట్టి జగపతి, కృష్ణారెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement