![జాబ్ మేళాకు అనూహ్య స్పందన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/31/30mdk13-350122_mr-1738290933-0.jpg.webp?itok=kkYOJb1-)
జాబ్ మేళాకు అనూహ్య స్పందన
మెదక్ కలెక్టరేట్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం, మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. ప్రిన్సిపాల్ హుస్సేన్ మాట్లాడుతూ.. గ్లిట్జ్ కన్సల్టెన్సీ సహకారంతో మొబైల్ తయారీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాల కోసం జాబ్ మేళా నిర్వహించినట్లు చెప్పారు. డిగ్రీ కళాశాలను పారిశ్రామిక రంగంతో అనుసంధానం చేసి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. జాబ్‌మేళాకు జిల్లావ్యాప్తంగా 120 మంది మహిళలు హాజరు కాగా, వారిలో తుది దశకు 45 మందిని ఎంపిక చేసినట్లు తెలి పారు. వీరిలో అన్ని అర్హతలను కలిగి ఆసక్తి చూపిన అభ్యర్థుల్లో సుమారు 30 మంది త్వరలో నియామకపత్రాలు అందుకోనున్నారని గ్లిట్జ్ కన్సల్టెన్సీ మేనే జింగ్ డైరెక్టర్ ఉషా వివరించారు. అంతకుముందు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ తిరుమల్‌రెడ్డి, జాబ్ మేళా కన్వీనర్ చంద్రశేఖర్, అధ్యాపకులు కాశీ విశ్వనాథ్, నరేష్‌గౌడ్, నిదర్శని, అరుంధతి పాల్గొన్నారు.
ఉద్యోగాలకు ఎంపికై న వారు వీరే..
Comments
Please login to add a commentAdd a comment