తప్పులుండొద్దు..
కొల్చారం(నర్సాపూర్): లోపాలు లేకుండా డిజిటల్ సర్వే చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ మండల వ్యవసాయాధికారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు రైతులకు ఎరువులు విక్రయించాలని సిబ్బందిని ఆదేశించారు. అక్కడి నుంచి పశువైద్య కేంద్రాన్ని సందర్శించారు. పశువులకు అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. అనంతరం వ్యవసాయ అధికారులతో కలిసి వసురాం తండా పరిధిలోని పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడి రైతులతో ముచ్చటించారు. క్షేత్రస్థాయిలోకి వచ్చే వ్యవసాయ అధికారులకు పంటల వివరాలు చెప్పాలని సూచించారు. ప్రభుత్వ పథకాలకు పంటల నమోదు తప్పనిసరని ఈసందర్భంగా తెలియజేశారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాఽ దికారి వినయ్, ఏడీఏ పుణ్యవతి, ఏఓ శ్వేతకుమారి, పీఏసీఎస్ చైర్మన్ మనోహర్, సీఈఓ కృష్ణ, రైతులు త దితరులు ఉన్నారు.
పక్కాగా డిజిటల్ సర్వే: కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment