మెదక్ మున్సిపాలిటీ: పోలీస్ యంత్రాంగం వృత్తి నైపుణ్యాన్ని మె రుగుపర్చుకోవాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి సిద్దిపేట జిల్లా రాజ్‌గోపాలపేట ఫైరింగ్ రేంజ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఈక్రమంలో గురువారం వార్షిక శిక్షణను ఎస్పీ పర్యవేక్షించి ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్నిరకాల ఆయుధ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలన్నారు. వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈసందర్భంగా ఫైరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందిని అభినదించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment