పట్టాలు దాటి.. ప్లాట్‌ఫాం పైకి!
చిన్నశంకరంపేట(మెదక్): మిర్జాపల్లి రైల్వేస్టేషన్‌లో రెండు వైపులా ప్లాట్‌ఫాం ఉంది. ఒక వైపు నుంచి మరో వైపునకు ప్రయాణికులు చేరుకునేందుకు రైల్వే అధికారులు పుట్‌వేర్ బ్రిడ్జి సైతం నిర్మించారు. కానీ గురువారం ఉదయం మిర్జాపల్లి రైల్వేస్టేషన్‌లో బోధన్ లోకల్ రైలును మధ్య పట్టాలపై నిలిపారు. దీంతో రైలు దిగిన ప్రయాణికులు పట్టాలు దాటుకుని ప్లాట్‌ఫాం మీదకు చేరుకునేందుకు తంటాలు పడ్డారు. అలాగే రైలు ఎక్కడానికి వచ్చిన మహిళలు, వృద్ధులు అవస్థలు పడ్డారు. రెండు రైళ్లు ఒకేసారి వచ్చిన సమయంలో ఒక రైలును మొదటి ప్లాట్‌ఫాం, మరో రైలును రెండో ప్లాట్‌ఫాం వద్ద నిలపాల్సిన సిబ్బంది అందుకు విరుద్దంగా రెండో ప్లాట్‌ఫాంపై గూడ్స్ రైలును నిలిపారు. దీంతో మధ్య పట్టాలపై సికింద్రాబాద్ వెళ్తున్న బోధన్ లోకల్ రైలును నిలిపారు. అదే సమయంలో నిజామాబాద్ వైపు వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపారు. దీంతో రైలు ఎక్కేవారు, దిగేవారు ఇబ్బందులు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment