రామాయంపేట(మెదక్): వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రజా సంక్షేమ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు గానూ బీజేపీ నాయకులు గురువారం రామాయంపేటలో ప్రధాని మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన రాగి రాములును సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మండలాధ్యక్షుడు నవీన్‌కుమార్‌గౌడ్, పట్టణ ఇన్‌చార్జి సిద్దరాంలు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్, నాయకులు త దితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment