తూప్రాన్‌లో తీవ్ర ఉద్రిక్తత
తూప్రాన్: తూప్రాన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చేగుంట మండలంలో సీఆర్పీలుగా విధులు నిర్వర్తిస్తున్న రమేశ్‌నాయక్, శ్రీనివాస్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను తూప్రాన్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. శనివారం ఉదయం జిల్లాలోని సీఆర్పీలు, మృతుల కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని ఆస్పత్రి గేటు వద్ద బైఠాయించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ రంగాకృష్ణ, ఎస్‌ఐ శివానందం సిబ్బందితో చేరుకోగా.. ఆందోళనకారులకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉద్రిక్తత మధ్య పోస్టుమార్డం నిర్వహించిన మృతదేహాలను చేగుంట మండలంలోని వారి స్వగ్రామాలకు తరలించారు.
సీఆర్పీల మృతిపై ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment