మెరుగైన ఫలితాలు సాధించాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: పదో తరగతి పరీక్షలు జీవితానికి టర్నింగ్ పాయింట్ అని.. విద్యార్థులు పట్టుదలతో చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాలను సందర్శించారు. అనంతరం కళాశాలలో మెనూ అమలు తీరును పరిశీలించి అభినందించారు. ఈసందర్భంగా బాలికలతో కలిసి భోజనం చేసి ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యసాధన కోసం శ్రమించాలని, భయం వీడి పట్టుదలతో చదవాలని పేర్కొన్నారు. అనంతరం మే 4న జరగనున్న నీట్ పరీక్ష కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 1,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ అధికారి వినయ్, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాగునీటి వినియోగంపై సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment