
ఆయిల్‌పామ్‌తో అధిక లాభాలు
ఆయిల్‌పామ్ మొక్క నాటుతున్న అధికారులు
చిన్నశంకరంపేట(మెదక్): వరికి ప్రత్యామ్నయంగా ఆయిల్‌పామ్ పంటను సాగుచేసి అధిక లాభాలు పొందాలని జిల్లా హార్టికల్చర్ జిల్లా అధికారి ప్రతాప్‌సింగ్ సూచించారు. బుధవారం మండలంలోని ధరిపల్లిలో ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్సిడీతో పంటను సాగుచేయవచ్చని, అంతర పంట సాగుకు సైతం ప్రభుత్వ సాయం పొందవచ్చన్నారు. ఇప్పటికైనా ఆయిల్‌పామ్ పంటను సాగుచేసేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. హార్టికల్చర్ అధికారులు సంతోష్, రచన, సుజాత, ఆయిపామ్ మేనేజర్ కృష్ణ పాల్గొన్నారు.
జిల్లా హార్టికల్చర్ అధికారి ప్రతాప్‌సింగ్