ఇటీవల దొంగలు పట్టపగలే ఇళ్లలోకి దూరి మరి దోచుకొవడం ఎక్కువైంది. సామాన్యులనే కాదు సెలబ్రీటీలను సైతం వదలడం లేదు. అటువంటి సంఘటనే మంగళవారం (సెప్టెంబర్ 7న) చంఢీగర్‌లో చోటు చేసుకుంది. ముగ్గురు దుండగులు నటి, మోడల్ అలంకృత సహాయ్‌ని బంధించి దాదాపు 6 లక్షల వరకు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. మోడల్, నటి అలంకృత తన తల్లిదండ్రుల కోసం ఇటీవల చంఢీగర్‌లోని సెక్టార్ 27లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. ఢిల్లీలో ఉన్న వాళ్లు రెండు, మూడు రోజుల్లో ఇక్కడికి షిఫ్ట్ కావాల్సింది. ఈ తరుణంలో మంగళవారం అలంకృత అక్కడి వచ్చి ఏర్పాట్లను పరిశీలించింది. ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉందని గమనించిన దుండగులు బలవంతంగా అలంకృత ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు.
దొంగతనానికి వచ్చిన ముగ్గురిలో ఒకరు ఆమె ఏటీఎం కార్డుని తీసుకెళ్లి రూ.50 వేలు విత్‌డ్రా చేశాడు. ఆ సమయంలో మిగిలిన ఇద్దరు అలంకృతను బంధించి, అరిస్తే చంపేస్తామని బెదిరించారు. అంతేకాదు ఇంట్లో ఉన్న నగలు, నగదును కూడా తీసుకెళ్లారు. మొత్తంగా దాదాపు 6 లక్షల వరకు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది.
ముగ్గురిలో ఒకడు అతనే..
మూడు రోజుల క్రితం అలంకృత ఫర్నిచర్ కొనగా, ఆదివారం వాటిని డెలివరీ చేశారు. ఆ డెలివరీకి వచ్చిన వారిలో ఒకరు ఈ ముగ్గురిలో ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.పోలీసుల ఫిర్యాదులో కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. నటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment