
ఈ రోజుల్లో ప్రేమించుకోవడం, విడిపోవడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా సినీ తారల్లో బ్రేకప్‌లు అనేవి కాస్త ఎక్కువే అని చెప్పక తప్పదు. నటి నయనతార, త్రిష వంటి చాలామంది నటీమణులు బ్రేకప్‌లను ఎదుర్కొన్నవారే. నటి దర్శ గుప్తా కూడా ఈ కోవకే చెందుతుంది. తొలుత బుల్లితెరపై ప్రత్యక్షమైన ఈ అమ్మడు ఆ తర్వాత కుక్ విత్ కోమాలి షో తో పాపులర్ అయ్యింది. తర్వాత వెండి తెరకు పరిచయమైంది. రుద్ర తాండవం, ఓ మై గోస్ట్ వంటి చిత్రాల్లో నటించింది.
కొత్త అవకాశాల కోసం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మార్చుకుంటోంది. అందాల ఆరబోతలో తన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా తన గ్లామరస్ ఫొటోలను తరచూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రను కరువు చేస్తోంది. ఈమె తాజాగా ఒక భేటీలో తన బ్రేకప్ గురించి చెబుతూ తాను బ్రేకప్ చెప్పిన ప్రేమికుడు ఇప్పటికీ తాను కావాలని వేడుకుంటూనే ఉన్నాడని చెప్పింది.
అయితే ప్రేమికుల మధ్య నమ్మకమే ముఖ్యమని ఒక్కసారి అది పోతే అంతేనని పేర్కొంది. అతను కోటీశ్వరుడు అయినా తనకు అవసరం లేదని, గుడిసెలో ఉంటున్న వాడైనా పర్వాలేదని నిజాయితీగా ఉండాలని నటి దర్శా గుప్తా పేర్కొంది. మొత్తం మీద మరో ప్రియుడి కోసం ఎదురుచూస్తున్నట్లు ఈ అమ్మడు చెప్పకనే చెప్పింది అన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment