
Kajol: బాలీవుడ్ నటి కాజోల్ ఈ మధ్యే 47వ పుట్టినరోజు జరుపుకుంది. కాకపోతే కరోనా వల్ల గ్రాండ్‌గా కాకుండా చాలా సింపుల్‌గా అత్యంత సన్నిహితుల సమక్షంలోనే బర్త్‌డే పార్టీ ఎంజాయ్ చేసింది. అయితే కాజోల్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో కొందరు అభిమానులు కాజోల్ కోసం ప్రేమగా కేక్ తీసుకొచ్చారు.
ఆమె కేక్ కట్ చేస్తుంటే పుట్టినరోజు పాట పాడారు. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకున్న సమయంలో ఆమె ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. ఒక్క కేక్ పీస్ తినండన్న అభిమానుల రిక్వెస్ట్‌ను తిరస్కరిస్తూ అడ్డంగా తలూపింది. కేక్ తినడం కుదరదని సంకేతాలిస్తూ అక్కడ నుంచి విసవిసా వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న అభిమానులు కొంత హర్టయినట్లు కనిపించారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ తన ప్రవర్తనేమీ బాగోలేదని విమర్శిస్తున్నారు.
'ఆమెకు ఎంత అహంకారమో చూడండి, ఇందుకే ఆమె అంటే నాకు మొదటి నుంచీ గిట్టదు', 'నా సిస్టర్ ఒకసారి కాజోల్‌ను కలిసింది. అసలు ఆవిడ కనీసం మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపించలేదు. కానీ రాణీ ముఖర్జీని కలిసినప్పుడు, ఆమె ఎంతో బాగా మాట్లాడి నా సోదరితో ఒక ఫొటో కూడా తీసుకుందట.. వాళ్లిద్దరికీ ఎంత తేడా ఉందో చూడండి', 'కాజోల్ స్క్రీన్ మీద కనిపించినట్లు రియల్ లైఫ్‌లో ఉండదు, బాగా యాటిట్యూడ్ చూపిస్తోంది', 'ఎంత హీరోయిన్ అయితే మాత్రం అంత పొగరు పనికిరాదు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా కాజోల్ చివరిసారిగా 'త్రిభంగ' సినిమాలో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment