Actress Pooja Ramachandran Shared Swimming Pool On Social Media - Sakshi
Sakshi News home page

Guess The Actress: స్విమ్ సూట్‌ బ్యూటీ.. ఎవరో కనిపెట్టండి చూద్దాం!

Published Tue, Jul 11 2023 2:55 PM | Last Updated on Tue, Jul 11 2023 3:14 PM

Actress Pooja Ramachandran Latest Pics - Sakshi

పన్నెండేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది. తెలుగు, తమిళం, మలయాళంలో కలిపి 30కి పైగానే సినిమాలు చేసింది. సైడ్ క‍్యారెక్టర్స్ చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. కట్ చేస్తే తెలుగు చిత్రాల్లో విలన్‌గా చేస్తున్న ఓ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఏప్రిల్ లో ఓ బిడ్డకు తల్లి అయింది. ఇప్పుడు కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఈ భామ.. గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది.

'స్వామి రారా' మూవీతో
పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు పూజా రామచంద్రన్. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈమె.. 2004లో మిస్ కోయింబత్తూర్ అవార్డు గెలిచింది. 2005లో మిస్ కేరళ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత వీడియో జాకీగా కొన్నాళ్లపాటు పనిచేసిన పూజ.. నటిగా మారింది. సూర్య '7th సెన్స్'తో ఇండస్ట్రీలోకి వచ్చింది. తెలుగులో నిఖిల్ 'స్వామి రారా' తో చాలామందికి పరిచయమైంది.

(ఇదీ చదవండి: నిహారికపై చైతన్య తండ్రి సంచలన వ్యాఖ్యలు!)

16 సినిమాల్లో
'స్వామి రారా' చిత్రంతో మొదలుపెడితే దోచేయ్, దళం, కృష్ణార్జున యుద్ధం, వెంకీమామ తదితర సినిమాల్లో పలు పాత్రలు పోషించింది. సినిమాల పరంగా బాగానే పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ 2 సీజన్ లోనూ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా పాల్గొంది. కానీ విజయం సాధించలేక కొన్ని వారాలకే హౌస్ నుంచి బయటకొచ్చేసింది. 

విలన్‌తో పెళ్లి
నటి కాకముందే అంటే 2010లోనే వీజే క్రెయిగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న పూజా.. 2017లో అతడికి విడాకులు ఇచ్చింది. తెలుగుతో పాటు దక్షిణాది చిత్రాల్లో విలన్ పాత్రలు చేసిన జాన్ కొక్కేన్ ని 2019లో పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఏప్రిల్ లో ఓ బాబు పుట్టాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో సమయాన్ని ఆస్వాదిస్తున్న పూజ.. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లోని ఫొటోలని షేర్ చేసింది. ఇందులో ఆమెని చాలా గుర్తుపట్టలేకపోయారు. 


(ఇదీ చదవండి: లేటు వయసులో హనీమూన్.. పోకిరి విలన్ ఎంజాయ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement