గిఫ్ట్ ఇచ్చిన సమంత.. అతడు తెగ మురిసిపోయాడు! | Samantha Ruth Prabhu Special Gift To Stylist Preetham Jukalker; Post Viral - Sakshi
Sakshi News home page

Samantha: స్టైలిష్ట్‌కి క్యూట్ సమంత బహుమతి.. వీడియో వైరల్

Published Wed, Oct 11 2023 4:56 PM | Last Updated on Wed, Oct 11 2023 5:35 PM

 Actress Samantha Gifts To Ear Ring Stylist Preetham Jukalker - Sakshi

స్టార్ హీరోయిన్ సమంత గిఫ్ట్ ఇచ్చింది. దాన్ని చూసి అతడు తెగ మురిసిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా 'ఖుషి' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన సామ్.. ఇప్పుడిప్పుడే మయోసైటిస్ బారినుంచి కోలుకుంటోంది. తాజాగా ఓ రెండు విషయాల్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

(ఇదీ చదవండి: చై-సామ్‌ కలుస్తున్నారంటూ వార్తలు.. షాకిచ్చిన సమంత!)

స్టార్ హీరోయిన్ సమంత స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇతడి ఒడిలో సామ్ కాళ్లు పెట్టుకుని పడుకుని ఉన్న ఓ ఫొటో అప్పట్లో వైరల్ అయింది. దీనిపై విపరీతమైన విమర్శలు రాగా, సామ్ ఆ ఫొటోని డిలీట్ చేసింది. ఆ  తర్వాత చైతూ-సమంత విడిపోవడానికి కూడా ఇతడే కారణమని విమర్శలు వచ్చాయి. కానీ సమంత తనకు అక్కలాంటిదని, చైతన్యకి కూడా ఈ విషయం తెలుసని అప్పట్లో చెప్పాడు.

విడాకుల తర్వాత సమంత.. తన బ్యాచ్‌కి కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. కరోనా టైంలో మయోసైటిస్ బారిన పడటం వల్ల సమంత బయట పెద్దగా కనిపించలేదు. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుటపడుతుండటంతో మళ్లీ బిజీ అవుతోంది. తాజాగా ప్రీతమ్.. సామ్ కోసం పింక్ కలర్ డ్రస్ డిడైన్ చేశాడు. ఇక సామ్.. అతడికి ఇయర్ రింగ్స్‌ని గిఫ్ట్ ఇచ్చింది. ఆ ఫొటోల్ని తన ఇన్ స్టాలో స్టోరీలో షేర్ చేసిన ప్రీతమ్.. తెగ మురిసిపోయాడు. 

(ఇదీ చదవండి: అమర్‌దీప్‌పై ట్రోలింగ్‌.. దయచేసి ఆపేయండంటూ తల్లి వేడుకోలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement