Actress Sanjjanaa Galrani Respond On Her Divorce Rumours: ‘బుజ్జిగాడు’ బ్యాటీ, కన్నడ హీరోయిన్ సంజనా గల్రానీకి 2020 గడ్డు కాలమని చెప్పుకొవచ్చు. శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో ఆమె ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లింది. ఈ క్రమంలో 2020 డిసెంబర్‌లో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె తన చిరకాల మిత్రుడు, ప్రియుడు డాక్టర్ పాషాను 2021 జనవరిలో రహస్య వివాహం చేసుకుంది. అప్పటి వరకు తరచూ వార్తల్లో నిలిచిన సంజన పెళ్లి అనంతరం మీడియాకు దూరంగా ఉంది.
చదవండి: ఇలా జరగడం బాధగా ఉంది: నాని భావోద్వేగం
ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె ప్రెగ్నెంట్ అంటూ కన్నడ మీడియాల్లో వార్తలు వినిపించాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ క్రమంలో సంజనకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సంజనకు తన భర్తతో మనస్పర్థలు వచ్చాయని, త్వరలో ఆమె భర్తకు విడాకులు ఇవ్వబోతోందంటూ సోషల్ మీడియా, మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇవి కాస్తా సంజన దృష్టికి వెళ్లడంతో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ మండిపడింది.
చదవండి: నిర్మాతల్లో ఐక్యత లేదన్న మోహన్ బాబు, స్పందించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు
తమ వైవాహిక జీవితం చాలా బాగుందని, తన పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పింది. అంతేకాదు ఆధారాలు లేని వార్తలు సృష్టించందని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సంజన హెచ్చరించింది. కాగా కన్నడ నటి అయిన సంజన తెలుగులో పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం సుపరిచితాలు అయ్యింది. ప్రభాస్ బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్‌లో మెరిసిన సంజన ఆ తర్వాత పలు చిత్రాల్లో సహా నటిగా, హీరోయిన్‌గా మెప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment