
ఏ హీరోయిన్ అయినా సరే అందానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే అందంగా ఉంటేనే కదా ఆఫర్స్, డబ్బులు వచ్చేవి. ఈ బ్యూటీ కూడా అప్పుడెప్పుడో 22 ఏళ్ల క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. స్టిల్ ఇప్పటికీ అదే గ్లామర్ మెంటైన్ చేస్తూ కుర్ర భామలందరూ అసూయ పడేలా తయారవుతుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన ఫొటోలు కూతురితో కలిసి వర్కౌట్ చేస్తున్న హీరోయిన్ ఎవరనేది ఇప్పటి జనరేషన్ కంటే 90స్ కిడ్స్‌ని అడిగితే టక్కున చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్లకు ఆమె క్రష్ అని చెప్పొచ్చు. అవును.. మీలో కొందరు కరెక్ట్‌గానే ఊహించారు. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు శ్రియ. సోమవారం ఆమె 42వ పుట్టినరోజు కావడం విశేషం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)
ఇకపోతే 2001లో 'ఇష్టం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కల్యాణ్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేసింది. అలా ఓ పదేళ్ల పాటు ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా చేస్తూనే సహాయ పాత్రల్లోనూ నటిస్తూ వచ్చింది.
ఈ మధ్య కొన్నాళ్లలో అయితే ఆర్ఆర్ఆర్, కబ్జ లాంటి పాన్ ఇండియా సినిమాల్లో శ్రియ నటించింది. ఈమె వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆండ్రూ కొశ్చివ్ అనే విదేశీయుడ్ని 2018లో పెళ్లి చేసుకుంది. వీళ్ల ప్రేమకు గుర్తుగా రాధ అనే పాప కూడా పుట్టింది. పైన ఫొటోలో శ్రియతో పాటు ఉన్నది ఈ పాపనే. అయితే మిగతా హీరోయిన్ల సంగతేమో గానీ.. శ్రియ మాత్రం గత 20 ఏళ్లుగా ఒకే లుక్ మెంటైన్ చేస్తూ చాలామందికి క్వశ్చన్ మార్క్ అయిపోయిందనే చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: 'పుష్ప 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. పెద్ద ప్లానింగే)
Comments
Please login to add a commentAdd a comment