
ప్రముఖ నటి శ్రియ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు(మంగళవారం) ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న శ్రియ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం శ్రియ మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా స్వామివారిని దర్శించుకోలేకపోయానని అన్నారు.
చదవండి: ఓటీటీలోకి నితిన్.. థియేటర్‌లోకి సందీప్, ఇంకా మరెన్నో..
ఇక ఆమె భర్త ఆండ్రీ కొశ్చేవ్ ఆలయం ముందు శ్రియకి ముద్దు పెట్టి తన ప్రేమను వ్యక్తపరిచారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం శ్రియ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం)లో అజయ్ దేవగణ్‌కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్ చిత్రంలో నటిస్తున్నారు.
చదవండి: పొన్నియిన్ సెల్వెన్: ఐష్‌తో ప్రత్యేకంగా భారీ పాట, 400 మందితో..
Comments
Please login to add a commentAdd a comment