Alia Bhatt Open Up About Trolled For Getting Pregnancy With Ranbir Kapoor After Her Marriage - Sakshi
Sakshi News home page

Alia Bhatt: పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీపై విమర్శలు.. తొలిసారి స్పందించిన ఆలియా

Published Wed, Jul 27 2022 5:38 PM | Last Updated on Wed, Jul 27 2022 6:03 PM

Alia Bhatt Opens Up On Getting Pregnancy Soon After Her Marriage - Sakshi

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది ఆలియా భట్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో సౌత్‌ ప్రేక్షకులకూ పరిచయమైంది. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌ను పెళ్లాడింది. రెండు నెలలకే తల్లి కాబోతున్నానంటూ గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొందరు వారికి శుభాకాంక్షలు తెలిపితే మరికొందరు మాత్రం పెళ్లయిందో లేదో అప్పుడే గర్భవతి ఏంటని నోరు పారేసుకున్నారు. తాజాగా దీనిపై ఆలియా స్పందించింది.

'ఒక అమ్మాయి ఏం చేసినా అందరికీ అదో పెద్ద వార్త అవుతుంది. తను ఎవరినైనా ప్రేమించినా, డేటింగ్‌ చేసినా, తల్లి కాబోతున్నా, క్రికెట్‌ చూడటానికి వెళ్లినా, హాలీడే ట్రిప్‌కు వెళ్లినా.. ప్రతిదాన్ని రాద్ధాంతం చేస్తారు. ఒక మహిళ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పాయింట్‌ అవుట్‌ చేస్తారు. నాది యుక్తవయసే. అయితే మాత్రం నాకు కుటుంబం ఉంటే, బేబీ పుడితే అది నా వృత్తిగత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అవి రెండూ వేర్వేరు.

కొన్ని గొప్ప విషయాలు మనం ప్లాన్‌ చేసుకోనవసరం లేదు, అవి వాటంతటవే జరుగుతాయి. నేను ఎప్పుడూ నా మనసుకు నచ్చిందే చేస్తాను. పనికిమాలిన విషయాలపై దృష్టి పెట్టకుండా నా పని నేను చేసుకుంటూ పోతాను'  అని చెప్పుకొచ్చింది. కాగా ఆలియాభట్‌ డార్లింగ్స్‌ సినిమాలో కనిపించనుంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 5 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

చదవండి: రెమ్యునరేషన్‌ తగ్గించుకుంటామన్న హీరోలు!
అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్‌ ఎఫెక్ట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement