బుల్లితెరపై ఫీమేల్ యాంకర్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ భరద్వాజ్.. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా తళుక్కుమంటున్నారు. సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తూ మంచి నటిగా మన్ననలు అందుకుంటున్నారు. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ చేసిన పాత్ర జనాలకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఇది ఆమె సినిమా కెరీర్‌కు టర్నింగ్ పాయింగ్‌గా చెప్పవచ్చు. అప్పటి నుంచి అనసూయకు సినిమా అవకాశాలు మెండుగానే వస్తున్నాయి. అయితే సినిమా ఎంపికల విషయంలో మాత్రం అనసూయ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగ మార్తాండ’లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే రవితేజ హీరోగా వస్తోన్న ‘కిలాడి’లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటితోపాటు తాజాగా అనూ బేబికీ మరో మూవీ ఆఫర్ తలుపు తట్టినట్లు సమాచారం. చదవండి: సేతుపతితో రంగమ్మత్త?!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ పాత్ర కోసం అనసూయను చిత్రయూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే చేతికి అందిన ఈ అవకాశాన్ని అనూ వద్దనుకుందని వార్తలు వినిపిస్తన్నాయి. పుష్పలో డిగ్లామర్ పాత్ర కోసం అనసూయను అడిగినట్లు.. మేకప్ లేకుండా నటించడం ఇష్టంలేకపోడంతో ఈ ఆఫర్‌కు నో చెప్పిందని టాక్. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి నటిస్తోన్న ఓ తమిళ సినిమాలో అనసూయ నటించేందుకు ఓకే చెప్పారు. దీంతో తొలిసారి తమిళ ఆడియన్స్‌ను ఆమె పలకరించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment