
అనసూయ భరద్వాజ్ ఎన్నో ఏళ్లుగా తెలుగునాట టాప్ యాంకర్‌గా వెలుగొందుతోంది. పలు టీవీ షోల ద్వారా బుల్లితెర మీద నానా హంగామా చేసే ఈ తార అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ వెండితెర మీద కూడా సత్తా చాటుతోంది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటన ప్రతి ఒక్కరినీ మంత్రముగ్దులను చేసింది. తర్వాత చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఆవిడకు తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అంటే రోజురోజుకీ అనసూయ రేంజ్ అంతలా పెరిగిపోతోంది.
ఇదిలా వుంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయను తాజాగా ఓ ఫ్యాన్ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అనసూయ, ఆమె భర్త సుశాంక్ ఎన్‌సీసీ గెటప్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. ఇది చూసి షాకైన యాంకర్.. ఓ మై గాడ్! ఈ ఫొటో నీకెక్కడ దొరికింది? అని షాకవుతూనే నిజంగానే మా ఇద్దరి జీవితం అక్కడే మొదలైంది అని వారి ప్రేమ పునాదులు ఎక్కడ పడ్డాయో చెప్పేసింది.
కాగా ఎన్‌సీసీ క్యాంప్‌లో పాట్నా అబ్బాయి సుశాంక్‌తో ప్రేమలో పడింది అనసూయ. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ వీరి ప్రేమను అనసూయ కుటుంబం తిరస్కరించింది. ఆమె తర్వాత మరో ఇద్దరు ఆడ పిల్లలున్నారని, వారి భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడ్డారు. అంతగా కావాలనుకుంటే ఇల్లు వదిలి వెళ్లిపోమన్నారు. అయినా సరే అన్నింటినీ భరించి, పెద్దలను ఒప్పించి 9 ఏళ్ల నిరీక్షణ తర్వాత అందరి అంగీకారంతో, ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు సంతానం.
Comments
Please login to add a commentAdd a comment