క్రేజీ అప్‌డేట్‌.. చిరు సినిమాలో హీరోయిన్‌గా అనుష్క! | Is Anushka Shetty Star In Chiranjeevi And Venky Kudumula Movie | Sakshi
Sakshi News home page

Anushka Shetty: అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. చిరు సినిమాలో హీరోయిన్‌గా ‘స్వీటీ’!

Published Tue, Jan 11 2022 8:32 PM | Last Updated on Tue, Jan 11 2022 9:19 PM

Is Anushka Shetty Star In Chiranjeevi And Venky Kudumula Movie - Sakshi

Anushka Shetty Heroine In Chiranjeevi Next Movie?: సౌత్‌లో స్టార్‌ హీరోలకు సమానంగా క్రేజ్‌ సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో మూవీతో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు పాపులారిటీ దక్కించుకున్న అనుష్క.. నిశ్శబ్దం మూవీ తర్వాత మరే సినిమాకు సంతకం చేయలేదు. దీంతో అనుష్క తెరపై కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్‌ నిరాశలో ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా అనుష్క ఈ సినిమా చేస్తుంది, ఆ సినిమాలో చేస్తుందంటూ వార్తలు వస్తు‍న్నప్పటికీ అవి పుకార్లు గానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో అనుష్క ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసే ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

చదవండి: Siddharth-Saina Nehwal: సైనాపై సిద్ధార్థ్‌ అభ్యంతరక వ్యాఖ్యలు, హీరోకు భర్త కశ్యప్‌ చురకలు

స్వీటీ అనుష్కకు ఓ క్రేజీ ఆఫర్‌ వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అనుష్క నటిస్తుందంటూ టాక్‌ నడుస్తోంది. కాగా ఖైదీ 150తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన చిరు యంగ్‌ హీరోలకు పోటీగా వరస సినిమాలను లైన్‌లో పెట్టారు. ఇప్పటికే ఆయన కొరటాల శివ దర్శకత్వంతో రూపొందిన ఆచార్య సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆచార్య షూటింగ్‌ అనంతరం ఏమాత్రం గ్యాప్‌ లేకుండా ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్, వాల్తేరు వీర్రాజు’ సినిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చాడు.

చదవండి: సల్మాన్‌ ఖాన్‌తో సీక్రెట్‌ డేటింగ్‌, క్లారిటీ ఇచ్చిన నటి సమంత..

ఇదిలా ఉండగా వీటితో​ పాటు చిరు మరో కొత్త ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇందులో హీరోయిన్‌గా అనుష్క పేరు పరిశీలించారట. అంతేకాదు ఇప్పటికే ఆమెను సంప్రదించి కథ వివరించినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి అనుష్క తన సమాధానం ఇవ్వాల్సింది ఉందని వినికిడి. ఆ తర్వాత దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇవ్వనుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ వార్తలపై స్వీటీ స్పందించేవరకు వేచి చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement