Bigg Boss 6 Telugu Launch Updates: Sudeepa Pinky Entered As BB6 Second Contestant - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu Contestants: రెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సుదీప(పింకీ)

Published Sun, Sep 4 2022 6:22 PM | Last Updated on Mon, Oct 17 2022 3:21 PM

Bigg Boss 6 Telugu: Sudeepa Pinky Entered As Second Contestant - Sakshi

Sudeepa Pinky In Bigg Boss 6 Telugu: నటి సుదీప అంటే గుర్తుపట్టరేమో కానీ 'నువ్వు నాకు నచ్చావ్‌' ఫేం పింకీ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాలో వెంకీ థిస్ ఇస్ పింకీ అంటూ వెంకీతో చేసే అల్లరి అంతాఇంతా కాదు. ఈ సినిమాతో ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్న సుదీప(పింకీ) చిన్నతనంలోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. 1994లో రవిరాజా పిన్నెశెట్టి దర్శకత్వంలో ధర్మరాజు ఎం.ఏ సినిమాతో ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు వంటి సినిమాల్లో నటించింది. బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్‌ఫెక్ట్, వంటి సినిమాల్లో నటించింది. సుదీప ఎక్కువగా ఎక్కువగా హీరోలకి చెల్లెలు పాత్రలోనే నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై కూడా కొన్ని సీరియల్స్‌లో అలరించింది. శ్రీరంగనాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడిన సుదీప పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు బిగ్‌బాస్‌-6తో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement