బిగ్‌బాస్‌: మూడు వారాలకు దామిని ఎంత సంపాదించిందో తెలుసా? | Bigg Boss 7 Telugu: Singer Damini Bhatla BB7 Remuneration Details And Elimination Reasons Inside - Sakshi
Sakshi News home page

Damini Bhatla Elimination Reasons: దామిని పారితోషికం ఎంతో తెలుసా? ఎలిమినేషన్‌కు కారణాలివే!

Published Mon, Sep 25 2023 4:06 PM | Last Updated on Mon, Sep 25 2023 5:15 PM

Bigg Boss 7 Telugu: Damini Bhatla Remuneration and Elimination Reasons - Sakshi

అతిగా ఆవేశపడేవాళ్లు, అనవసరంగా వాదిస్తూ సాగదీసేవాళ్లు, తమ డప్పు తామే కొట్టుకునేవాళ్లు, కేవలం డైలాగులకే పరిమితమయ్యేవాళ్లు, వెనకాల గోతులు తవ్వేవాళ్లు, కిచెన్‌కే పరిమితమై ఆడటమే మర్చిపోయేవాళ్లు.. ఇలా ప్రతిసీజన్‌లోనూ ఇలాంటి వాళ్లు కనిపిస్తూనే ఉంటారు. ఈ సీజన్‌లో అలాంటివారున్నారు. అయితే మిగతావాళ్ల సంగతి ఎలా ఉన్నా కిచెన్‌కే పరిమితమైనవాళ్లు మాత్రం హౌస్‌లో ఎక్కువ వారాలు ఉన్న దాఖలాలు లేవు.

వంటలక్క..
అందరికీ వండిపెట్టడం మంచిదే కానీ, వంట మాత్రమే చేస్తే కష్టం. దామిని విషయంలోనూ అదే జరిగింది. ఎప్పుడు చూసినా వంటగదిలోనే పనులు చేసుకుంటూ పోయింది. కిచెన్‌లో ఏమాత్రం తేడా వచ్చినా, ఎవరు పనిచేయకపోయినా నోరేసుకుని పడిపోయేది. అందుకే ఆమెకు వంటలక్క, వార్డెన్‌ అన్న పేర్లు కూడా ఇచ్చేశారు నెటిజన్లు. కేవలం కిచెన్‌కే పరిమితమై ఆటకు దూరమవడమే తన ఎలిమినేషన్‌కు ప్రధాన కారణం. కొన్నిసార్లు తన మాటలకు, వైఖరికి అసలు పొంతన ఉండేది కాదు.

బూతులు నచ్చవంటూనే
బూతులు మాట్లాడితే నచ్చదని చిరాకుపడ్డ దామిని తాను మాత్రం ఇంగ్లీష్‌లో తెగ బూతులు మాట్లాడింది. ఇక్కడ ఆమెపై విమర్శలు వచ్చాయి. పాటలతో మెప్పించిన సింగర్‌ ఆటలో, మాటలో మెప్పించలేకపోయింది. ఓ టాస్క్‌లో అయితే ప్రిన్స్‌ను వీర లెవల్లో టార్చర్‌ పెట్టింది. పేడ ముఖాన కొట్టడమే కాకుండా, తన నోటిలో కూడా వేసింది. ఇది టాస్కే అయినప్పటికీ గ్యాప్‌ ఇవ్వకుండా నోటిలో పేడ కొట్టడం అస్సలు కరెక్ట్‌ కాదన్న కామెంట్లు వినిపించాయి.

దామిని పారితోషికం ఎంతంటే?
ఏదేమైనా ఇంకొన్ని వారాలు ఉంటాననుకున్న దామిని ఆలోచనను పటాపంచలు చేస్తూ బిగ్‌బాస్‌ తనను మూడోవారంలోనే ఎలిమినేట్‌ చేశాడు. ఇన్నివారాలకుగానూ ఆమెకు ఎంత పారితోషికం ముట్టిందనే విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ బాహుబలి సింగర్‌ వారానికి రూ.2 లక్షల మేర పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మూడు వారాలకుగానూ రూ.6 లక్షల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు సమాచారం.

చదవండి: నామినేషన్స్‌లో మాజీ ప్రియుడి గురించి ప్రస్తావన.. రతికకు ఇచ్చిపడేసిన శుభశ్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement