మొదట్లో బిగ్‌బాస్ షోలో కేవలం సెలబ్రిటీలే ఎక్కువగా కనిపించేవారు. సీరియల్, సినిమా, మోడలింగ్‌కు చెందినవారినే ఎక్కువగా తీసుకువచ్చేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న జనాలకు సైతం బిగ్‌బాస్ ఆఫర్ ఇస్తున్నారు. అలా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నోరా ముస్కాన్ మలయాళ బిగ్‌బాస్ ఆరో సీజన్లో అడుగుపెట్టింది. తాజాగా ఆమె హౌస్‌లో తన కష్టాలను ఏకరువు పెట్టింది.
వేరేవేరే పేర్లతో..
'నా అసలు పేరు సైబాల్ సదత్. పొన్నుస్ అనే నిక్‌నేమ్‌తో సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేశాను. కానీ అదేం పేరని మా ఫ్రెండ్ ఏడిపించడటంతో నోరాగా మార్చుకున్నాను. నా అసలు పేరు వాడితే ఎక్కడ మా పేరెంట్స్‌కు తెలిసి పెద్ద గొడవ అవుతుందోననే ఇలా పేరు మార్చుకున్నాను. నాకు 21 ఏళ్ల వయసులోనే పెళ్లయింది. కానీ మా బంధం వర్కవుట్ కాకపోవడంతో విడాకులు అడిగాను. నేను విడాకులు తీసుకోవడం నా తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేదు. నా భర్త కూడా విడాకుల ప్రక్రియ మరింత ఆలస్యం కావాలనే చూశాడు.
విడాకులు తీసుకుంటే తప్పా?
ఎందుకని అందరూ డివోర్స్ను పెద్ద తప్పులా చూస్తారు? ఇద్దరు మనుషులు కలిసుండలేనప్పుడు ఆ బంధాన్ని తెంచుకోవాలనుకోవడంలో తప్పేముందో అర్థం కాదు. పైగా ఇక్కడ కూడా తప్పంతా అమ్మాయిదే అన్నట్లు మాట్లాడతారు. ఇక నాకు ఎప్పుడైతే విడాకులు మంజూరయ్యాయో అప్పుడే నేను స్వతంత్రంగా, నా కాళ్లపై నేను నిలబడాలనుకున్నాను. అలా సోషల్ మీడియాను ఉపయోగించి ఇన్ఫ్లూయెన్సర్గా ఎదిగాను. దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కూడా కొన్నాను.
మా నాన్న పట్టించుకోవట్లే
కానీ మా నాన్నకు ఇదంతా ఇష్టం లేదు. ఇలా సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించడం తనకు ఏమాత్రం నచ్చలేదు. ఇప్పటివరకు నా ఇంటివైపే రాలేదు. ఈ మూడేళ్లలో మా నాన్నను కలిసిందే లేదు. ఏదేమైనా నేను వాళ్లను నిందించడం లేదు. వాళ్ల ఆలోచనా విధానం వేరు. కానీ ఎవరూ నా ప్రయాణాన్ని ఆపలేరు' అని చెప్తూ ఎమోషనలైంది సైబాల్.
చదవండి: చాలా సింపుల్‌గా స్టూడియోలో కూతురి పెళ్లి చేసిన వెంకటేశ్.. ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment