
Bigg Boss 5 Telugu, Uma Devi Eliminated: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో రెండోవారం కూడా ముగిసింది. ఫస్ట్ వీక్‌లో సరయూ హౌస్ నుంచి వెళ్లిపోగా తాజాగా కార్తీకదీపం ఫేమ్ భాగ్యం అలియాస్ ఉమాదేవి షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. బండ బూతులు మాట్లాడుతూ ఫ్యామిలీ ఆడియన్స్ ఆగ్రహానికి గురైన ఆమె సండే ఎపిసోడ్‌లో అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది. ఆమెను ప్రేమగా పొట్టి అని పిలుచుకునే లోబో ఉమా ఎలిమినేట్ అవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కన్నీళ్లు ఉబికి వస్తున్నా వాటిని కనురెప్ప దాటనీయకుండా జాగ్రత్తపడ్డాడు.
ఇక స్టేజీ మీదకు వచ్చిన ఉమతో హోస్ట్ నాగార్జున ఓ గేమ్ ఆడించాడు. 17 మంది కంటెస్టెంట్ల ఫొటోలు ఉన్న కుండలను ఆమె ఎదుట పెట్టి అందులో 8 కుండలను బద్ధలు కొట్టాలని టాస్క్ ఇచ్చాడు. దీంతో ఆట మొదలెట్టిన ఉమా.. నీకు అనిపించింది చెప్పేస్తావ్ కానీ, కానీ ఎదుటివాళ్లు ఎలా తీసుకుంటారు? అనేది పట్టించుకోవంటూ సిరి ఫొటో ఉన్న కుండ పగలగొట్టింది. అంతేకాకుండా షణ్ముఖ్ ఆట సిరి ఆడుతుందని ఆరోపించింది. లహరి.. ఈ ప్లాట్‌ఫామ్ మీద చాలా వీక్ అని, పక్కవాళ్లు సపోర్ట్ చేస్తేనే ఆడుతుందే తప్ప సొంతంగా ఆడట్లేదని చెప్పింది. సేఫ్‌గా ఆడుతున్నారంటూ ప్రియ ఫొటో ఉన్న కుండ బద్ధలు కొట్టింది.
షణ్ముఖ్‌ను నీ గేమ్ నువ్వు ఆడుకోమని సలహా ఇస్తూనే, సిరి కేవలం ఫ్రెండ్ మాత్రమేనని, గేమ్‌పరంగా తనను పక్కన పెట్టమని నొక్కి చెప్పింది. ఆ తర్వాత యాంకర్ రవి గురించి చెప్తూ అందరినీ దగ్గరకు తీసుకుంటున్నావు, కానీ ఈ క్రమంలో వేరేవాళ్లకు దూరమైపోతున్నావన్న విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరించింది. లోబోను హౌస్‌లో ఎంతోమంది కించపరుస్తున్నారంటూ ఎమోషనల్ అయింది. ఎంతోమంది స్వీట్ హార్ట్ అని అంటారు, కానీ లోపలి నుంచి అనరు. ఇకనైనా నీ బుర్రతో గేమ్ ఆడంటూ సలహా ఇచ్చింది. యానీ మాస్టర్‌తో ఎటువంటి గొడవా లేదని, కానీ ఆమెకు కోపం ఎక్కువని పేర్కొంది. ఇక్కడ మనకు ఎవ్వరూ ఏం కాదు! అమ్మ, అక్క, చెల్లి అని మాత్రం చూడకండి అని యానీ మాస్టర్‌కు సూచించింది. తర్వాత నటరాజ్ మాస్టర్‌ను బాగా ఆడాలని, ఇలాగే ఆడితే వేరే లెవల్‌లో ఉంటారంటూ అతడి కుండ పగలగొట్టింది. అనంతరం అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment