డబుల్‌ ఎలిమినేషన్‌.. ప్రోమోలో ఆ జంటనే లేపేశారుగా! | Bigg Boss Telugu 7: Buzz, Gautham Krishna Into Secret Room | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: డబుల్‌ ఎలిమినేషన్‌.. లీక్‌ చేసిన బిగ్‌బాస్‌.. ఒకరిని సీక్రెట్‌ రూమ్‌లో!

Published Sun, Oct 8 2023 5:45 PM | Last Updated on Sun, Oct 8 2023 6:14 PM

Bigg Boss Telugu 7: Buzz, Gautham Krishna Into Secret Room - Sakshi

బిగ్‌బాస్‌ షోకి ఉన్న ప్రధాన సమస్య లీక్స్‌.. ఎపిసోడ్‌ ప్రారంభం అయ్యే సమయానికే ఆరోజు ఏం జరగబోతుంది? ఎవరు గొడవపడతారు? ఎవరు ఆడుతారు? ఎవరు గెలుస్తారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? ఇలా అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దీన్ని ఆపడం ఎవరి తరమూ కావడం లేదు. ఫలితంగా బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో పస లేకుండా పోతోంది.

ఈసారి కూడా అదే జరిగింది. డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండబోతుందని ప్రచారం జరిగింది, జరుగుతూనే ఉంది. అయినా మీరు చెప్పేదేంటి? నేనే చెప్తేస్తే ఓ పనైపోతుంది అనుకున్నారో ఏమో కానీ తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో ఇద్దరు కంటెస్టెంట్లనే లేపేశారు. డాక్టర్‌బాబు గౌతమ్‌ కృష్ణ, శుభశ్రీ రాయగురు ఇద్దరూ ప్రోమోలో ఒక్కచోట కూడా లేకపోవడంతో వీరి ఎలిమనేషన్‌ దాదాపు ఖరారైపోయింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది.

ఎలిమినేట్‌ అయింది ఇద్దరే కానీ, ఒకరిని నిజంగానే అవతలకు పంపించేయలేదని లేటెస్ట్‌ టాక్‌! గౌతమ్‌ కృష్ణను సీక్రెట్‌ రూమ్‌లోకి తీసుకెళ్లి ఎపిసోడ్‌ అంతా అయ్యాక తిరిగి హౌస్‌ లోపలకు పంపిస్తారట! మరి ఈ సీక్రెట్‌ రూమ్‌ వ్యవహారం నిజమే అయితే అది ఏమేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి! ఇకపోతే సిద్దార్థ్‌ హౌస్‌లో చేసిన హంగామా మామూలుగా లేదు. అటు మాస్‌ మహారాజ రవితేజ సైతం రంగంలోకి దిగాడు. వీరి రచ్చ రంబోలా చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!

చదవండి: బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతున్న కామెడీ ఫిలిం.. రెట్టింపైన కలెక్షన్స్‌.. ఓటీటీ పార్ట్‌నర్‌ ఏదంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement