మరో దిగ్గజ దర్శకుడు కుమార్ సహానీ(83) తుదిశ్వాస విడిచారు. హిందీలో గతంలో పలు హిట్ సినిమాలు తీసిన ఈయన.. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కోల్‌కతా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని నటి మిఠా వశిష్ట్ ధ్రువీకరించింది. ఈ క్రమంలోనే పలువురు నటీనటులు కుమార్ సహానీకి సంతాపం తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)
1940 డిసెంబర్ 7న సింధ్‌లోని లర్కానాలో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) పుట్టారు. అయితే పాక్ విభజన తర్వాత.. ఈయన కుటుంబం ముంబైకి వచ్చేసింది. అలా ముంబై యూనివర్సిటలో చదువుకున్నారు. బీఏ (ఆనర్స్) లో గ్రాడ్యుయేట్ అయ్యారు. ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో డైరెక్షన్ కోర్స్ చేశారు. దర్శకుడిగా స్క్రీన్ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1972లో మాయా దర‍్పన్, 1984లో తరంగ్, 1989లో ఖయల్ గాధ, 1990లో కస్బా లాంటి హిట్ సినిమాలు తీసింద ఈయనే కావడం విశేషం.
(ఇదీ చదవండి: మీ మరణవార్త జీర్ణించుకోలేకపోతున్నా.. ఎన్నో త్యాగాలు చేశారు..)
Comments
Please login to add a commentAdd a comment